AP Local Body Polls: రాజకీయాలు వదిలి పొలం బాట, గుర్తు పట్టలేని కొత్త లుక్‌తో కనిపించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, గంగులవారి పాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న రఘువీరా దంపతులు

ఒకప్పుడు మంత్రి. అలాగే ఏపీసీసీకి అధ్యక్షుడు..కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నప్పుడు ఎప్పుడూ సెక్యూరిటీ గార్డులు గన్ మెన్లతో తిరిగే మంత్రి నేడు ఇలా చిన్న మోపెడ్ ండి మీద ోటు కేంద్రానికి వచ్చారు. ఇంతకీ ఈయనెవరొ చెప్పనే లేదు కదా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి (Ex APCC President N.Raghuveera Reddy).

Ex APCC President N.Raghuveera Reddy (Photo-Twitter)

Amaravati, Feb 22: ఈ ఫోటోలో ఉన్న నాయకుడిని గుర్తుపట్టారా.. ఒకప్పుడు మంత్రి. అలాగే ఏపీసీసీకి అధ్యక్షుడు..కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నప్పుడు ఎప్పుడూ సెక్యూరిటీ గార్డులు గన్ మెన్లతో తిరిగే మంత్రి నేడు ఇలా చిన్న మోపెడ్ ండి మీద ోటు కేంద్రానికి వచ్చారు. ఇంతకీ ఈయనెవరొ చెప్పనే లేదు కదా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి (Ex APCC President N.Raghuveera Reddy). పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ (AP Local Body Polls) సందర్భంగా గంగుల వారిపాలెంలో ఓటు వేయడానికి వచ్చారు.

మంది మార్బలం లేకుండా ఓ సాధారణ మోపెడ్ వాహనంపై పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు. అది కూడా పక్కా రాయలసీమ స్టయిల్లో పంచెకట్టు, చొక్కా, పైన తువాలుతో మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఓటింగ్ కేంద్రానికి వచ్చారు. అంతేకాదు, మోపెడ్ పై తన అర్ధాంగి సునీతను (Sunitha Raghuveer) కూడా తీసుకువచ్చారు. అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో రఘువీరారెడ్డి, సునీత దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

Dr. N Raghuveera Reddy Tweet

2004 నుంచి 2014 వరకు ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా.. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు ఏపీసీపీ అధ్యక్షుడిగా రఘువీరా కొనసాగారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిన తర్వాత దాదాపు రాజకీయ చిత్రపటం నుంచి కనుమరుగైన రఘువీరా.. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కనిపించేవారు.

10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడయిన రఘువీరా... పాలిటిక్స్‌కు దూరం పాటిస్తున్నారు. అయితే ఆ మధ్య తన ఊరి చెరువుకు గండి పడటంతో స్వయంగా అనుచరులతో కలిసి రంగంలోకి దిగిన రఘువీరారెడ్డి... స్వయంగా ఇసుక బస్తాలు మోసి ఆ గండిని పూడ్చేశారు. దీంతో అప్పుడు వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సొంతూరులో జరుగుతున్న ఆలయ నిర్మాణం పనులను రఘువీరా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి రఘువీరారెడ్డితో చర్చలు జరిపి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేకపోవడంతో... రఘువీరా పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా... ఇస్తే ఏ పార్టీలోకి వెళతారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.



సంబంధిత వార్తలు