AP Horror: ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీభత్సం.. రోడ్డు పక్కన ఉన్న వారి మీదనుంచి దూసుకెళ్లిన బస్సు.. లారీ టైర్ మార్చుతుండగా ఘోరం.. ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం.. పత్తిపాడు హైవేపై చోటుచేసుకున్న ప్రమాదం

పత్తిపాడు హైవేపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది.

AP Accident (Credits: X)

Vijayawada, Feb 26: ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పత్తిపాడు హైవేపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (Super Luxury) డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాడినాడ-చిన్నంపేట హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని మొమ్మూరు వద్ద పోలీసులు బస్సును గుర్తించి ఆపారు. నిందిత డ్రైవర్‌ను గుర్తించారు.

PM Modi Viral Video: సముద్ర గర్భంలోకి వెళ్లి సాహసం చేసిన మోడీ..సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన మోడీ..

మృతులు వీళ్లే

మృతులను దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారని, ఒకరు ప్రత్తిపాడుకు చెందినవారని వివరించారు.

NITI Aayog: దేశంలో ఐదు శాతం మేర తగ్గిన పేదరికం.. నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ లో వెల్లడి

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif