IPL Auction 2025 Live

AP IAS Transfers: ఏపీలో ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారుల బ‌దిలీ, కీల‌క శాఖ‌ల క‌మిష‌నర్ల మార్పు, బ‌దిలీ అయిన వారి పూర్తి లిస్ట్ ఇదుగో...

ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (Neerab kumar prasad) ఉత్తర్వులను జారీ చేశారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

Vijayawada, July 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS Transfers) అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (Neerab kumar prasad) ఉత్తర్వులను జారీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీదత్‌ను నియమించింది. అంతేకాదు.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ ఎం.వి. శేషగిరి, హ్యాండ్లూమ్స్, టెక్స్ట్‌టైల్స్ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్ నియమితులయ్యారు. అలాగే సెర్ప్ సీఈవో గా వీర పాండ్యన్, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున నియమితులయ్యారు.

 

సీహెచ్‌ శ్రీదత్‌: మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ (మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు

ఎం.వి.శేషగిరి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌ రేఖారాణి: హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌

మల్లికార్జున: బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు)

చేవూరి హరికిరణ్‌ : ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌

ప్రసన్న వెంకటేశ్‌: సాంఘిక, సంక్షేమశాఖ కార్యదర్శి

శ్రీకేష్‌ బాలాజీరావు: భూ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్‌

గిరీశ్‌ షా: పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ

నారపురెడ్డి మౌర్య: తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌

దినేష్‌ కుమార్‌: గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌

ఎం.వేణుగోపాల్‌రెడ్డి: మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌

నిషాంత్‌ కుమార్‌: ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌

సూరజ్‌ ధనుంజయ్‌: పల్నాడు జేసీ

జి.సి.కిషోర్‌ కుమార్‌: క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీ

రామసుందర్‌రెడ్డి: ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌

కీర్తి చేకూరి: ట్రాన్స్‌ కో జాయింట్‌ ఎండీ

విజయ సునీత: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌

సంపత్‌ కుమార్‌: విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌

ధ్యానచంద్ర: విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌

కేతన్‌ గార్గ్‌: రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌

అమిలినేని భార్గవతేజ: గుంటూరు జిల్లా జేసీ

హిమాన్షు కోహ్లీ: తూర్పుగోదావరి జేసీ

నిశాంతి : కోనసీమ జిల్లా జేసీ

గోవిందరావు : కాకినాడ జిల్లా జేసీ

ఎన్‌. తేజ్‌ భరత్‌ : కడప మున్సిపల్‌ కమిషనర్‌

లక్ష్మీ షా: ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ సీఈవోగా అదనపు బాధ్యతలు)

మంజీర్‌ జిలానీ: ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ (శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు)

కృతికా శుక్లా: ఇంటర్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌

రవి సుభాష్‌: ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీ

వీరపాండ్యన్‌: సెర్ప్‌ సీఈవో

ఆదర్శ్‌ రాజేంద్రన్‌: అన్నమయ్య జిల్లా జేసీ

ఎం.హరినారాయణ: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌

ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌: శ్రీకాకుళం జేసీ

అదితి సింగ్‌: కడప జేసీ

పి.ధాత్రిరెడ్డి: ఏలూరు జేసీ

అభిషేక్‌ గౌడ: అల్లూరి జిల్లా జేసీ

ఎం.కృష్ణతేజ: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌

సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, నవీన్‌: సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లు

నూరుల్‌ కమల్‌: ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ

నిధి మీనా: ఎన్టీఆర్‌ జిల్లా జేసీ

సి.విష్ణు చరణ్‌: నంద్యాల జిల్లా జేసీ

శుభం భన్సల్‌: తిరుపతి జిల్లా జేసీ



సంబంధిత వార్తలు