Andhra Pradesh: శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో లాక్ డౌన్ (Lockdown) కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (AP minister Vellampalli Srinivas Rao) వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
Amaravati, May 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో లాక్ డౌన్ (Lockdown) కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (AP minister Vellampalli Srinivas Rao) వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఏపీని వణికిస్తున్న కోయంబేడు మార్కెట్, కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ అక్కడివే, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య
అయితే... అన్ని దేవాలయాల్లో కూడా యధావిధిగా నిత్య పూజలు. సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు. అదే విధంగా ఆర్జిత సేవల కోసం ‘ఆన్‌లైన్’ (Online payments) ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను మంత్రి ఆదేశించారు.
భక్తులను శ్రీవారి దర్శనానికి (Tirumala Tirupati Devasthanams) సామాజిక దూరంతో అనుమతించాలని, సంఖ్యను దాదాపుగా కుదించేందుకు టీటీడీ (TTD) ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించి దర్శనాలకు సంబంధించి విధి విధానాలతో కూడిన నిర్ణయాన్ని తీసుకోనుంది. ఈ విధి విధానాలతో ప్రయో గాత్మకంగా టీటీడీ ఉద్యోగులతో మొదలుపెట్టేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. గంటకు 500 మంది చొప్పున దర్శనానికి అనుమతించనున్నారు.
తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను 10 నుంచి 15 రోజులు పాటు దర్శనానికి అనుమతించేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వామివారికి నిత్య కైంకర్యాల సమయం మినహాయిస్తే 14 గంటలు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ దర్శనానికి అనుమతించే భక్తులు సంఖ్యను 7 వేలకు పరిమితం చేయనున్నారు. ప్రయోగాత్మాక పరిశీలన పూర్తయ్యాక స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం కల్పిస్తోంది.
శ్రీవారి దర్శనానికి భక్తులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినపక్షంలో టీటీడీ వారికి అవసరమైన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన స్లాట్ల విధానాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ ద్వారా కేటాయించి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.