Amaravati, May 18: ఏపీ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య (AP COvid-19 Report) 2,282కి చేరింది. ఈ వైరస్ వల్ల రాష్ట్రంలో (Andhra Pradesh) ఇప్పటివరకు 50 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం 705 యాక్టివ్ కేసులు ఉండగా, 1,527 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇండియాలో లక్షకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కొత్త కోవిడ్ 19 కేసులు, వణికిస్తున్న ముంబై
కొత్తగా నమోదైన 52 కేసుల్లో 19 కోయంబేడు మార్కెట్‌తో సంబంధం కలిగినవే ఉన్నాయి. ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, నెల్లూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 4, కడప, పశ్చిమగోదావరిలో రెండు చొప్పున, విజయనగరం, విశాఖపట్నంలో ఒక్కో కొత్త కేసు ఉన్నాయి.
కర్నూలులో తాజాగా మరో 28 మంది కోవిడ్‌ను జయించి..ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్ విజేతల సంఖ్య 403కు చేరుకుంది. ఇది మొత్తం కేసుల్లో 71 శాతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 159 మంది (26 శాతం) మాత్రమే చికిత్స పొందుతున్నారు.
AP Corona Report
#COVIDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,713 సాంపిల్స్ ని పరీక్షించగా 52 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*94 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/x9nOxi0Rhi
— ArogyaAndhra (@ArogyaAndhra) May 18, 2020
వలస కూలీలపై కరోనా పంజా విసిరింది. సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చామని ఆనందపడ్డ వారికి అంతలోనే కష్టమొచ్చింది. చెన్నై నుంచి వచ్చిన వారి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఒకటితో ప్రారంభం కాగా తాజాగా 19 నమోదై మొత్తం 20కి చేరినట్టు సమాచారం. వీరిలో మత్స్యకారులు, ఇతరత్రా కూలీలు ఉన్నారు.
ఇక ప్రకాశం జిల్లాలో ఉన్న 63 కోవిడ్–19 పాజిటివ్ కేసులన్నీ కోలుకుని నెగిటివ్ రావడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న దశలో మరో మూడు పాజిటివ్ కేసులు శనివారం నమోదయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన జిల్లా వాసులకు కోవిడ్–19 పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
సూళ్లూరుపేట కరోనా పాజిటివ్ కేసుల సెగ శ్రీహరికోటను సైతం తాకింది. కోవిడ్ కేసులు నమోదు కానంత వరకూ తాము జనరల్ డ్యూటీలు చేయలేమని షార్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. షార్ రెండో గేటు వద్ద వారంతా ధర్నాకు దిగారు. దీంతో షార్ ఉన్నతాధికారులు ఒప్పుకోక తప్పలేదు. సూళ్లూరుపేటలో కోయంబేడు మార్కెట్టు ద్వారా సంక్రమించిన కరోనా కేసుల సంఖ్య 39కు చేరుకుంది.