AP MLC Election Result: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ

మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.

AP MLC Elections Candidates (Photo-File Image)

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు. వెంకటరమణ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరడం గమనార్హం.

వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ పోలవరం, దాన్ని కొడుకుగా పూర్తి చేసేది నేనే, అసెంబ్లీలో సీఎం జగన్, ప్రధానిని కలిసింది కూడా ఈ ప్రాజెక్ట్ కోసమేనని వెల్లడి

సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్‌ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి.

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఈ నెల 25న మూడో విడత వైఎస్సార్‌ ఆసరా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌) తిరుగుబాటు చేయడం టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది. వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి.

గెలిచిన అభ్యర్థులు వీరే..