AP MLC Election Result 2023: టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్లేనా, ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి అనురాధ గెలుపు, 5 స్థానాల్లో గెలిచిన వైసీపీ, ఒక స్థానానికి జరుగుతున్న కౌంటింగ్

ఏపీలో మ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది

AP MLC Elections Candidates (Photo-File Image)

ఏపీలో మ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి.

వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ పోలవరం, దాన్ని కొడుకుగా పూర్తి చేసేది నేనే, అసెంబ్లీలో సీఎం జగన్, ప్రధానిని కలిసింది కూడా ఈ ప్రాజెక్ట్ కోసమేనని వెల్లడి

సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్‌ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి.

టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌) తిరుగుబాటు చేయడం టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది.

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఈ నెల 25న మూడో విడత వైఎస్సార్‌ ఆసరా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

ఎమ్మెల్సీగా గెలిచిన వారు వీరే..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా గెలిచిన మర్రి రాజశేఖర్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ గెలుపు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత విజయం

వైఎఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా గెలిచిన చంద్రగిరి ఏసురత్నం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా పెన్మత్స సూర్యనారాయణ రాజు గెలుపు

టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా అనురాధ గెలుపు

అనురాధ విజయంతో వైసీపీ అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓటమిపాలు కానున్నారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీరిద్దరిలో ఎవరు గెలుపొందుతారనే ఉత్కంఠ నెలకొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement