AP MLC Elections 2021: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నామని తెలిపిన పార్టీ ప్రధాన కార్యదర్శి

ప్రస్తుతం మండలిలో 18 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని ఆయన (Sajjala Ramakrishna Reddy) చెప్పారు.

Sajjala Ramakrishna Reddy (Photo-Twitter)

Amaravati, Nov 12: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను (YSRCP MLC candidates) పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని ఆయన (Sajjala Ramakrishna Reddy) చెప్పారు. ఇప్పుడిస్తున్న 14 స్థానాలతో కలిపి మొత్తం 32 స్థానాల్లో 18 మంది సభ్యులు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు. శాసనమండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌కే దక్కిందని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు. సీనియర్‌ నాయకులతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం ఖరారు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చే మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, పాలవలస విక్రాంత్, ఇసాక్‌ బాషా, డీసీ గోవిందరెడ్డిల పేర్లను ప్రకటించామని గుర్తు చేశారు.

ఏపీలో కొత్తగా 262 మందికి కరోనా, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు

14 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఇందులో 7 స్థానాలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించగా.. మిగిలిన 7 స్థానాలను ఓసీలకు కేటాయించారన్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సీట్లు కేటాయించారన్నారు. కౌన్సిల్‌ చరిత్రలో తొలిసారి నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారని తెలిపారు.