AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం
రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది.
Vjy, Sep 18: ఏపీ గీత కార్మికులకు (Geetha workers) ప్రభుత్వం గుడ్‌న్యూస్(Good News) చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది. విజయవాడలో మంత్రి వర్గ సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్ యాదవ్ ,కొండపల్లి శ్రీనివాస్ నూతన మద్యం పాలసీపై తయారు చేసిన నివేదిక వివరాలను విలేకరులకు వివరించారు.
ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త ఎక్సైజ్ విధానం తీసుకువస్తున్నామని వారు ప్రకటించారు. వినియోగదారుడికి నాణ్యమైన, అందుబాటులో ధరకే మద్యాన్ని అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సంఘాలు, అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, రేపు జరుగునున్న క్యాబినేట్ సమావేశంలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు.రాష్ట్రంలో మొదటిసారిగా ప్రిమియం అవుట్‌లెట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు.