AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు,135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు, పోస్టుల వివరాలను ప్రకటించిన మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టుల వివరాలను (AP Nominated Posts 2021) మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు.పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, July 17: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టుల వివరాలను (AP Nominated Posts 2021) మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు.పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు.

135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్‌ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని సజ్జల వెల్లడించారు.

విశాఖలో విషాదం, తల్లితో పాటు ముగ్గురు పిల్లలు అనుమానాస్పద మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న విశాఖ అరకు పోలీసులు

ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు 

శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,

విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు

పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు

కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు

గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు

ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు

అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

వైఎస్సార్‌ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు

కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల, గ్రంథాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి, ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ నియమితులయ్యారు. మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి, టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌, హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి, డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన, బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌, ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ, డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు, ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని, ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు నియమితులయ్యారు.

పూర్తి లిస్ట్ ఇదే

►ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం

►సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత

►డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)

►డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)

►ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి

►ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు

►SEEDAP ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం)

►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం)

►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం)

►డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం)

►ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి

►ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌

►ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా గేదెల బంగారమ్మ

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)

►బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి (విజయనగరం)

►డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం)

►డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం)

►ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌

►రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషగిరి

►ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌

►ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి

►ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌రావు

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)

►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (DCMS) ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)

►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)

►సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)

►రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు

►నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ

►సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి

►సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి

►రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు

►రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా మేడపాటి షర్మిలారెడ్డి

►రాజమండ్రి స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌గా చందన నగేష్‌

►కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌

►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో)

►ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో)

►కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి

►సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో)

►రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి

►ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో)

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు

►సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో)

►ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌

►కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌

►రాష్ట్ర సాహిత్యం అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి

►ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు

►రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా బర్రి లీల

►ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి

►ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో)

►వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో)

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా పీవీఎల్‌ నరసింహరావు (ప.గో)

►రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పేర్నాటి సుస్మిత

►స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పొనాక దేవసేన

►రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్‌

►రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్‌గా పొట్టెల శిరీష యాదవ్‌

►ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ ఛైర్మన్‌గా షేక్‌ సైదాని

►రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి

►నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ద్వారకానాథ్‌

►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డి.శారద (నెల్లూరు)

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వి.చలపతి (నెల్లూరు)

►AHUDA ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాసులు (అనంతపురం)

►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా లోమాడ ఉమాదేవి (అనంతపురం)

►పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహ

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా మానుకింద లిఖిత (అనంతపురం)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now