Case Filed Against JC Prabhakar Reddy: రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు..జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాడిపత్రిలో రెండో వైస్‌ చైర్మన్‌‌గా ఎన్నికైన టీడీపీ మద్దతుదారు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు (Case Filed Against JC Prabhakar Reddy) చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై (TDP leader former MLA JC Prabhakar Reddy) కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

TDP Ex MLA JC Prabhakar Reddy And His Son Asmith Reddy Arrested In Hyderabad (Photo-ANI)

Amaravati, July 31: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు (Case Filed Against JC Prabhakar Reddy) చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై (TDP leader former MLA JC Prabhakar Reddy) కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌-2తో పాటు జిల్లాలోని పది మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.

తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ బలపరిచిన) ఎన్నిక కాగా.. ఇక్కడ ఎన్నిక ప్రక్రియను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పట్టణంలో అక్రమ భవనాల కూల్చివేతను అడ్డుకోవడంతో పాటు భూ కబ్జాదారులకు మద్దతిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెండవ వైస్ ఛైర్మన్‌గా పాతకోట బంగారు మునిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్‌ గేమ్‌ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్‌ చైర్మన్‌ అయ్యారు.

విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు జగన్ సర్కారు కసరత్తు, ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కూడా అందుబాటులోకి

ఇదిలా ఉంటే జేసీ రాజకీయం ఏమిటో ఇక నుంచి నేను చూపిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హెచ్చరిస్తూ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మీసం తిప్పారు. స్థానిక నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌.. వైస్‌ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని తన సత్తా ఏమిటో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మరోసారి నిరూపించానన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను గానీ, కొడుకు, భార్య గానీ తమ తడాఖా ఏమిటో జేసీ సోదరులకు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చివరికి బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. వైస్‌ చైర్మన ఎంపిక ను బాయ్‌కాట్‌ చేయడానికి పోలీసులు సహకరించకపోవడమేనని వై సీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బాయ్‌కాట్‌ చేయడమంటే చేతగాని తనమనీ, అవమానమని ఎద్దేవా చేశారు. ‘నీ చే తగానితనం వల్ల ముఖ్యమంత్రి, జిల్లా ఇనచార్జ్‌ మంత్రికి అవమానకరంగా మారింది. నేనెక్కడా ప్రగల్భాలు పలకలేదు. ఇలాంటి అవమానం జరిగి ఉండి ఉంటే నేనైతే ఊరువిడిచి వెళ్లేవాడిని. నేను కౌన్సిల్‌మీట్‌కు వెళ్లకుండా కౌన్సిలర్లతో వైస్‌ చైర్మన్ ఎన్నిక జరిపించి, నా సత్తా ఏమిటో చూపించా. ఈరోజు జరిగిన వైస్‌ చైర్మన ఎన్నికలో మహిళా కౌన్సిలర్లు మిమ్ములను కబడ్డీ ఆడించారు. మున్సిపల్‌ కార్యాలయం మెట్లు ఎక్కలేకపోయావని, మున్సిపల్‌ మినిట్స్‌ బుక్‌లో సంతకం పెట్టలేకపోయావంటే జేసీ పవర్‌ ఏమిటో తెలుసుకోవాల’ని ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. జరగబోవు కో-ఆప్షన ఎంపికలో సైతం తన సత్తా ఏమిటో నిరూపిస్తానని జేసీ సవాల్‌ విసిరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now