Police Recruitments in AP: ఏపీలో పోలీసు ఉద్యోగాలపై శుభవార్త.. ఏటా 6,500 మందికి పోలీస్ ఉద్యోగాలు, రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించిన డీజీపీ గౌతం సవాంగ్

వచ్చే ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ (Police recruitment) చేస్తామని ఆయన వెల్లడించారు.

DGP Gautam Sawang (Photo-Twitter)

Amaravati, July 7: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు (large-scale recruitment, next three years) చేపడతామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP Gautam Sawang) చెప్పారు. వచ్చే ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ (Police recruitment) చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన దాదాపు 15 వేల మంది మహిళా సురక్షా కార్యదర్శులకు మహిళా పోలీసుల హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి కానిస్టేబుల్‌ తరహా విడతల వారీగా క్యాప్సుల్‌ శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రంలో ఒకసారి 6,500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందని డీజీపీ గుర్తు చేశారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ ప్రాజెక్టులు సందర్శించాకే ఏపీ ప్రాజెక్టులు సందర్శించాలని లేఖలో తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

కాబట్టి 15 వేల మంది మహిళా పోలీసులకు క్యాప్సుల్‌ శిక్షణ ముగిసిన తరువాత ఇతర రెగ్యులర్‌ పోలీసు నియామక ప్రక్రియపై దృష్టి సారిస్తామన్నారు. 2019–20లో ఇప్పటికే 3,057 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసి శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నామన్నారు. ఇంకా 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని చెప్పారు.

Here's AP Police Tweets

ఈ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో మొత్తం 6,05,949 పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. వాటిలో 1,84,264 రెగ్యులర్‌ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19,701 ఉద్యోగాలు, ఔట్‌ సౌర్సింగ్‌ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 34,563 ఖాళీలు మాత్రమే భర్తీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు