AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Rain alert for AP (Photo-ANI)

ఏపీ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ వచ్చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరంవైపు చేరే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్ర తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి

ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చూ మూడు రోజులు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ అన్నారు.కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీ పట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif