Weather ForeCast Hyderabad Meteorological Center warned that there will be rains in Telangana for three day

Vijayawada, Dec 20: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం ఏపీ తీరం వెంబడి పయనిస్తుందని హెచ్చరించింది. ఈ అల్పపీడనం వల్ల ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, మత్స్యకారులను కూడా అలెర్ట్‌ చేసింది. ఆయా ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్న ఈ ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.

తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

మిగతా జిల్లాల్లో కూడా

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని మిగతా జిల్లాల్లో కూడా నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల గంటకు 60 కిలో మీటర్ల మేర ఈదురు గాలులు వీస్తాయన్నది. ఇదిలా ఉండగా ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపై కూడా ఉంటుందని, అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ గజగజ

తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతల స్థాయిలు పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా, పొడిగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటలకు వరకు పొగమంచు కమ్మేస్తుండటంతో ఉదయం పూట పనులు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.