COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రత్యేక దృష్టి; రాష్ట్రంలో కొత్తగా 1,439 కోవిడ్ కేసులు నమోదు మరియు 1,311 మంది రికవరీ, 14,624కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 22 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇప్పటికీ ఒక్క డోస్ వ్యాక్సిన్ వేసుకోని వారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 44 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత...

COVID 19 Outbreak | (Photo Credits: IANS)

Amaravathi, September 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా స్థిరంగా కొనసాగుతుంది. రోజూవారీ కోవిడ్ కేసులు సుమారు వెయ్యి నుంచి 15 వందల మధ్య నమోదవుతున్నాయి. ప్రతిరోజూ నమోదయ్యే కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య తక్కువగా నమోదవుతుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన మార్పులు కనిపించడం లేదు.

మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 22 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇప్పటికీ ఒక్క డోస్ వ్యాక్సిన్ వేసుకోని వారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 44 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండో డోస్ కోసం ఏ వయసు వారైనా వచ్చి వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.

ఇక, ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,856 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,439 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,26,042కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,23,147 గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు నుంచి 261, నెల్లూరు నుంచి 260 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,964కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,311 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,97,454మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,624 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.



సంబంధిత వార్తలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.