Notices to Chandrababu Residence: కృష్ణమ్మ ఉగ్రరూపం, చంద్రబాబు ఇంటితో సహా కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు, ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచన

ఏపీలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీరు పోటెత్తడంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు (AP Revenue Officials)నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు (Notices to Chandrababu Residence) జారీ చేశారు.

Amaravati, Sep 28: ఏపీలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీరు పోటెత్తడంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు (AP Revenue Officials)నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు (Notices to Chandrababu Residence) జారీ చేశారు.

కృష్ణా నది (Krishna River) వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Here's Prakasam Barrage water Flow Visuals

ఎగువన కురుస్తున్న వర్షాలకు గంట గంటకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పరివాహాక ప్రాం‍తాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైనాయి. కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. విజయవాడ నగరంలో (Vijayawada) నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను అధికారులు తరలిస్తున్నారు.

చంద్రబాబు నయా వ్యూహాం, తెలుగుదేశం పార్టీకి కొత్త టీం, ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

 చంద్రబాబు ఇంటితో సహా 36 భవనాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిపెట్టారు.

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 5.81 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను క్లియర్‌ స్థాయికి ఎత్తి 5.06 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా, కీసర వాగు నుంచి 50 వేలు, పాలేరు వాగు నుంచి 13,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. సోమవారానికి వరద మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

పేద రైతు కలను నెరవేర్చబోతున్న వైఎస్సార్ జలకళ, ఉచిత బోరు పథకాన్ని నేడు లాంచ్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, అర్హులు, అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? పూర్తి సమాచారం మీకోసం

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటి విడుదల ఈ సీజన్‌లో తొలిసారిగా ఐదు లక్షల క్యూసెక్కులు దాటింది. వరద ప్రవాహం మరికొంత పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. వరద పెరుగుతున్నందున ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందిగా గుంటూరు జిల్లా యంత్రాంగం రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

కాగా, ఆదివారం సాయంత్రానికే పులిచింతల డ్యాం నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ప్రకాశం బ్యారేజీ దిగువకు ఏడు లక్షల క్యూసెక్కులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. పరీవాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద సహాయక చర్యల కోసం పలుచోట్ల కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు.

అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, సెప్టెంబర్‌ 3న చివరి మంత్రి వర్గ సమావేశం, ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ అంశంపై సమావేశంలో చర్చ

కాగా, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు సూచించారు. ఆదివారం రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిపారు.

తూర్పు బిహార్‌ పరిసరాల్లోని అల్పపీడనం బలహీనపడింది. తూర్పు బిహార్‌ను అనుకుని ఉన్న సబ్‌-హిమాలయాస్‌, సిక్కిం, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి గ్యాంగ్‌టక్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసా కోస్తా ప్రాంతం మీదుగా ఏపీ తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే ఏపీ దక్షిణ ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో 28న ఉత్తరాంధ్ర, యానాం, 29, 30 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా

Share Now