AP SSC Results 2022 Declared: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల, టెన్త్‌ పరీక్షా ఫలితాలను Results.manabadi.co.in లింక్ ద్వారా తెలుసుకోండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.

Representational Image | File Photo

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయ‌డం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఈ లింక్ ద్వారా మీరు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారిక సైట్ http://www.results.manabadi.co.in/2022/AP/SSC/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-2022-03062022.htmద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ఇక టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ 83వ నంబరు జీవో జారీచేశారు.

సినిమా టికెట్ల అమ్మకాలపై సరికొత్త మార్గదర్శకాలు, విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం సర్వీస్ చార్జీ వసూలు, థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఇక ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్‌ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.