Students Drowned: మహాబలిపురం బీచ్ లో ఏపీ విద్యార్ధుల గల్లంతు, ఒకరు మృతి, మరో నలుగురికోసం గాలింపు, కాలేజీ టూర్ కోసం వెళ్లి విషాదాంతం
సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
Chennai, March 02: తమిళనాడు మహాబలిపురం బీచ్ (Mahabalipuram Beach) వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. నలుగురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు (Students Drowned) అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ నలగురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు (Tamilnadu) టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థి మృతదేహం వెలికితీశారు. ఇంకా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Mahasena Rajesh: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్
ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. వీరి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది.