AP Vote on Account Budget Today: నేడు ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Vijayawada, Feb 7: 2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను (AP Vote on Account Budget Today) ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం (AP Government) బుధవారం అసెంబ్లీకి (Assembly) సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను చదువుతారు.
మొత్తం బడ్జెట్ అంచనా ఇదే
అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.