Srivari Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ నెలలో సుప్రభాతం, తోమాల వంటి సేవలకోసం లక్కీడిప్ రిజిస్ట్రేషన్లు మొదలు
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
Tirumala, JAN 18: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి /Srivari Seva Tickets) ఏప్రిల్ నెల దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా షెడ్యూల్‌ను టీటీడీ (TTD) బుధవారం వెల్లడించింది. ఈ నెల 18 నుంచి 27 వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రభాతం (Suprabhatham), తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ (Luckey DIP) కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా టికెట్లు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ సేవా టికెట్లను ఇదేనెల 22న ఉదయం 10 గంటలకు, అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.