Atchannaidu Leaked Video: చంద్రబాబుపై తిరుపతిలో నేనే చొక్కా విసిరేశాను, ఆయన వల్ల నాకు ప్రాణ హాని ఉంది, తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల వెంకటేశ్వరరావు, అచ్చెన్నాయుడుతో సంభాషణ వీడియోను లీక్ చేసిన వ్యక్తి ఇతనే..

తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

Akula Venkateswara Rao (Photo-Video Grab)

Amaravati, April 14: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ కార్యకర్త ఆకుల వెంకటేశ్వర రావు మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో (Atchannaidu Leaked Video) వైరల్‌గా మారిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నాయకుడు, వీడియోను లీక్ చేసిన ఆకుల వెంకటేశ్వరరావు (TDP Akula Venkateswara Rao) ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

మంగళవారం రాత్రి ఆయన తిరుపతి వెస్టు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన (Akula Venkateswara Rao) మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేశానన్నారు. అయితే చంద్రబాబు, అచ్చెన్నాయుడు గుర్తించక పోవడమే కాకుండా చిన్నపాటి సహాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అత్యంత సన్నిహితుడైన కేఎల్‌ నారాయణ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్‌లోని నా 400 గజాల భూమిని కబ్జా చేశాడు. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నానని తెలిపారు.

చంద్రబాబు ఒక మాట చెబితే నా భూమి నాకు నిమిషాల్లో వస్తుంది. అయితే ఆయన ఆ మాట చెప్పకుండా ఆ కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు. ఈ విషయంపై మరో మారు విన్నవిద్దామని సోమవారం తిరుపతిలో జరిగిన ప్రచార సభకు హాజరయ్యాను. అక్కడ కూడా నాకు చుక్కెదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి, తిరుపతి ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ లేదు, బొక్కా లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అచ్చెన్నాయుడి లీక్ వీడియో, క్లిప్పింగ్‌పై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

తిరుపతి ప్రచార సభలో పలు మార్లు చంద్రబాబునాయుడును పిలిచినా కూడా చూసీ చూడనట్టు వ్యవహరించడంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ క్రమంలో నిరసన తెలియజేసేందుకు చొక్కా విప్పి విసిరేశాను. అయినా కూడా పట్టించుకోక పోవడంతో ముందుకెళ్లి నిలదీశాను. తనకు ఏమీ పట్టనట్టుగా అభివాదం చేస్తూ తప్పించుకుని పారిపోయాడు. చంద్రబాబు వెనుక ఉన్న రామ్మోహన్‌నాయుడు ‘అన్నా నేను నీతో మాట్లాడుతా’ అని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు.

Here's TDP Akula Venkateswara Rao Videos

చొక్కా విసరడం అందరూ చూడడంతో ఆ సంఘటనను పెడదారి పట్టించేందుకే చంద్రబాబుపై రాళ్లు పడ్డాయంటూ కొద్దిసేపటికే కొత్త డ్రామా ప్రారంభించారు. బాబుపై ఎలాంటి రాళ్లూ పడలేదు. నేను 30 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉంటూ ఒకసారి జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశాను. ఈ పరిస్థితిలో చంద్రబాబు వల్ల నాకు ప్రాణ హాని ఉంది. మరోవైపు టీడీపీ ముఖ్య నాయకులు చంపేస్తామని ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నారా లోకేష్‌ను ఏదైనా సాయం చేయమని కోరితే ఇంటిల్లిపాది కట్టకట్టుకుని చావమంటూ సలహా ఇచ్చారు. వీరిని నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు.