Atchannaidu Leaked Video: ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి, తిరుపతి ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ లేదు, బొక్కా లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అచ్చెన్నాయుడి లీక్ వీడియో, క్లిప్పింగ్‌పై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
Atchannaidu Kinjarapu (Photo-Twitter)

Amaravati, April 13: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఓ కార్యకర్త మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో (Atchannaidu Leaked Video) వైరల్‌గా మారింది. తనకు చంద్రబాబు, లోకేష్ అన్యాయం చేశారంటూ వెంకట్ అనే పార్టీ నేత అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) ముందు ఆవేదన వెల్లగక్కాడు. తనకు అన్యాయం జరిగిందని లోకేశ్‌కు (Nara Lokesh) చెబితే ఆత్మహత్య చేసుకోమన్నాడని అచ్చెన్నాయుడు ముందు వాపోయాడు.

అతని వ్యాఖ్యలను సమర్థించిన అచ్చెన్నాయుడు ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు, ఏం లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ (TDP Acham Naidu Sensational Comments) చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో క్లిప్పింగులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (YCP MLC Duvvada Srinivas) మీడియాకు విడుదల చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాగా టీడీపీని నమ్ముకుని తాను రోడ్డున పడ్డానని, కట్టుబట్టలతో మిగిలానని ఆ నాయకుడు విమర్శంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన బాధలను నారా లోకేష్‌తో చెప్పుకోగా.. సూసైడ్ చేసుకోమని సలహా ఇచ్చాడని ఆయన వాపోయారు. దీనికి అచ్చెన్నాయుడు బదులిస్తూ ఆయనే సరిగ్గా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సముదాయించడం ఈ వీడియోలో రికార్డయింది. 12 కోట్ల రూపాయలను తాను పార్టీ కోసం ఖర్చు పెట్టానని, తనను ఆదుకోవాలని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్దాయన (చంద్రబాబు)ను కలిసి అభ్యర్థించానని ఆయన చెప్పారు.

Here's Viral Videos

ఈ 17వ తేదీ (తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్) తరువాత అందరం ఫ్రీ అయిపోతామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ తరువాత పార్టీ లేదు.. బొక్కా లేదని వ్యాఖ్యానించడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది. దానికి ఆ నాయకుడు- `అయిపోయంది సార్ పార్టీ అయిపోయింది. మీరేమైనా అనుకోండి.. పార్టీ జీరో అయిపోయింది..` అని బదులిచ్చారు. పార్టీ కీలక నాయకులను తాను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ ఫోన్లు కూడా లేపట్లేదని ఆ నాయకుడు అచ్చెన్నాయుడికి వివరించారు. 30 సంవత్సరాలు తాను పార్టీ కోసం కష్టపడితే చివరికి తన ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వలేనంత అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్ళీ నేను వస్తా..మీ తోక కట్‌ చేస్తా, రాళ్ళు వేస్తే తోలు తీస్తా.. తాట తీస్తా అంటూ చంద్రబాబు ఫైర్, ఓడిపోతామనే ఈ డ్రామాలకు దిగారన్న వైసీపీ, చంద్రబాబు తిరుపతి రోడ్ షొ లో రాళ్ల దాడిపై వేడెక్కిన ఏపీ రాజకీయం

ఈ వీడియో క్లిప్పింగులను మీడియాకు విడుదల చేసిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనను శ్రీకాకుళం దున్నపోతుగా విమర్శించారు. ఏ టీడీపీకైతే అచ్చెన్న అధ్యక్షుడిగా ఉంటున్నారో.. అదే పార్టీకి వ్యతిరేకంగా స్వయంగా ఆయనే వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడదే టీడీపీకి ఓటు వేయాలంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను అభ్యర్థిస్తారని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం ఉన్నాం కాబట్టే పార్టీలో కొనసాగుతున్నామంటూ అచ్చెన్నాయుడి స్థాయి నాయకుడే వ్యాఖ్యానించారని, టీడీపీకి తిరుపతి ప్రజలు ఎందుకు ఓటేయాలని నిలదీశారు.

Here's Kinjarapu Atchannaidu Tweet

ఇది ఇలా ఉంటే సోషల్‌ మీడియాలో వీడియో సంభాషణ వైరల్‌ కావడంపై అచ్చెన్నాయుడు స్పందించారు. నువ్వు ఎన్ని తప్పుడు వీడియోలు క్రియేట్‌ చేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్‌రెడ్డి అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్‌ విసిరిన సవాల్‌కు తోకముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లు వేయించావు. ఈ రోజు నా సంభాషణలను వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తిరుపతిలో టీడీపీ విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు అంటూ ట్వీట్లు చేశారు

మరోవైపు టీడీపీ నేతలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ దొరికింది. దీంతో సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లనుంది టీడీపీ నేతల బృందం. గవర్నర్‌ను కలిసి నిన్న చంద్రబాబు తిరుపతి సభపై రాళ్ల దాడి ఘటనను వివరించనున్నారు బృందం సభ్యులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు