Tirupati, April 13: తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభపై రాళ్ల దాడి (Stones Pelted at TDP Roadshow) జరిగింది. కొందరు దుండగులు సభకు విచ్చేసిన వారిపై రాళ్లు విసరగా, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ మహిళ ఉంది. దుండగులు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార వాహనంపైనా రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు (Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu) వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ కల్పించలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. తన సభకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రౌడీయిజాన్ని సహించేది లేదని చంద్రబాబు (N Chandrababu Naidu) హెచ్చరించారు. కాగా, చంద్రబాబు రోడ్డుపై బైఠాయించడంతో ఇతర నేతలు, కార్యకర్తలు కూడా అక్కడే ఆందోళనకు ఉపక్రమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని ఆరోపించారు. టీడీపీ నేతలపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారని వెల్లడించారు. టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ దుష్ట పన్నాగాలకు పాల్పడుతోందని అన్నారు. రాళ్ల దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.
Here's Stones Pelted at TDP Roadshow Visuals
తిరుపతి సభపై రాళ్ళ దాడికి వ్యతిరేఖంగా రోడ్డు పై బైఠాయించిన టిడిపి జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు...... #రౌడీరాజ్యం pic.twitter.com/Ay5GkNUrJn
— 🄼 🄲 𝐑 𝐀 𝐉 🦅 (@BeingMcking_) April 12, 2021
చంద్రబాబు పై రాళ్లు విసిరిన వారికి రండిరా... నా తడాఖా చూపిస్తా అంటూ వార్నింగ్. రౌడీ రాజ్యం అంటూ నినాదాలు ఇచ్చిన చంద్రబాబు. pic.twitter.com/17oR9lYgVH
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) April 12, 2021
నవ రత్నాలు కాదు, నవ మోసాలు చేశాడు జగన్.
- వెంకటగిరి సభలో చంద్రబాబు.#Lakshmi4Tirupati pic.twitter.com/4RAPYJ68LT
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) April 12, 2021
గాయపడిన ఒక కార్యకర్తను ఆయన వాహనంపైకి పిలిపించి.. గాయాలను ప్రజలకు చూపించారు. ‘పోలీసులు ఉన్నారా? లేరా? ఇంత పెద్ద మీటింగులో పోలీసులెవరూ లే రా’ అని నిలదీశారు. ‘రండిరా తడాఖా చూపిస్తాం. ధైర్యంగా ముందుకు రండి.. తాడోపేడో తేల్చుకుందాం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాళ్ళు వేస్తే తోలు తీస్తా.. తాట తీస్తా’ అని రాళ్లు రువ్వినవారిని హెచ్చరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రౌడీయిజాన్ని అణిచివేశానని, మళ్ళీ వస్తా.. మీ తోక కట్ చేస్తానని వైసీపీ నేతలను హెచ్చరించారు.
ఒక్క అవకాశమివ్వండంటూ ప్రజలను బతిమాలి అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏమిటీ అరాచకం, మాఫియా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు బందిపోట్ల కంటే విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. పులివెందుల పంచాయతీలు రాష్ట్రమంతా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రౌడీయిజం, మాఫియాలతో కూడిన పాలనతో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని జగన్‌కు సూచించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ విఫలమైందని, తాను పోటుగాడినని, తనను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల్లో జగన్ ప్రచారం చేశారు.
హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక ఇపుడు కేంద్రాన్ని హోదా అడుగుతున్నారా? కేంద్రం మెడలు వంచారా? అదే మా పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు’ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబమైనా ఆనందంగా ఉందా అని ప్రశ్నించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని జగన్ అమలు చేశారా? చేస్తారని మీరు నమ్ముతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. మడమ తిప్పడంలో జగన్‌రెడ్డి ఎక్స్‌పర్ట్ అని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ధరలను విపరీతంగా పెంచారని, అందుకే మందు బాబులంతా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన కృష్ణాపురం ఠాణా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తనకు సీఎం పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదని, ప్రజా సేవే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. తాను నిర్మించిన హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తయారైందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్, కేంద్ర వర్సిటీని స్థాపించానని చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రేణిగుంటలో వందకుపైగా పరిశ్రమలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవల అన్యాయంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తనను తొమ్మిది గంటలు నిర్బంధించారని చంద్రబాబు వాపోయారు. తాను అనుకుని ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. తన సభలకు జనస్పందన ఉన్నా, ఓట్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిలదీయడం వల్లే ఆలయాలపై దాడులు తగ్గాయని చెప్పారు. బంగారు బాతు అయిన అమరావతిని మూడు రాజధానుల పేరుతో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సీఎంగా ఉన్న సమయంలో సినిమాలకు రాయితీలు ఇచ్చి, టికెట్ ధరలు పెంచుకోమని ప్రోత్సహించానని చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా ఆదాయాన్ని తగ్గించేందుకే ఈ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచలేదన్నారు. చివరలో పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు.
టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరిస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిష్పాక్షికంగా వ్యవహరించాలని, పోలీసులు సీఈసీ పరిధిలో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలని కోరారు. రాళ్ల దాడి జరగడంపై నిరసనగా తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు... ర్యాలీగా బయల్దేరి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు ఎస్పీ కార్యాలయం ముందు రోడ్డుపై నిలబడ్డారు. జరుగుతున్న పరిణామాల పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ సుప్రజ బయటికి వచ్చి చంద్రబాబుతో మాట్లాడారు.
ఈ ఘటనలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించాలని వారు నిర్ణయించుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతల బృందం గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది. జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబుపై తిరుపతిలో రాళ్లదాడికి యత్నించడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు చంద్రబాబు భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కోరనున్నారు. రాళ్లదాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరనున్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలకు దిగాడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Panchayat Raj Minister Peddiredi RC Reddy) అన్నారు. తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం రాత్రి మంత్రి పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి పర్యటనలో రాళ్లు వేశారని, దానికి వైఎస్సార్‌సీపీ నేతలే కారణమని చంద్రబాబు నిందలు వేయడం సరైంది కాదన్నారు.
మిద్దెపై నుంచి రాయి విసిరారని చెబుతున్న చంద్రబాబు.. అది ఎవరికి తగిలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న నాటకాన్ని ప్రజలు ఎవరూ విశ్వసించబోరన్నారు. రాళ్ల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జోడించి విమర్శించడం చంద్రబాబుకు తగదన్నారు. సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.