Atmakur Bypoll 2022: వైసీపీ మెజార్టీ ఎంతనేదే చర్చ, ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు, బీజేపీ-వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు (Atmakur Bypoll 2022) సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ హరీందర ప్రసాద్ తెలిపారు.
Atmakur, June 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు (Atmakur Bypoll 2022) సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ హరీందర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరులో ఇన్‌చార్జ్ ఆర్డీవో బాపిరెడ్డితో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని.. వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు. రూ.3,19,480 కోట్లతో ఏపీ వార్షిక రుణ ప్రణాళిక ఖరారు, వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు, ప్రాథమిక రంగానికి రూ. 2,35,680 కోట్లు, మిగిలిన మొత్తం ఇతర రంగాలకు కేటాయింపు
స్వతంత్ర అభ్యర్థి ఒకరు గురువారం నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో (Atmakur by-Election) నిలిచారని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులున్నాయని.. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు.