Atmakur Bypoll Results 2022: లక్ష దాటని మెజార్టీ, ఆత్మకూరు ఉప ఎన్నికలో 82,888 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ విజయం, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో (Atmakur Bypoll Results 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో ( Assembly By election Results 2022) విజయ ఢంకా మోగించారు.
Nellore, June26: ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో (Atmakur Bypoll Results 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో ( Assembly By election Results 2022) విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి.
ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,13,338 కాగా ఈ నెల 23న జరిగిన పోలింగ్ లో కేవలం 1,37,081 మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు.
రౌండ్లవారీగా ఫలితాలు
19 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 80,161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
18 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 75,785 ఓట్ల ఆధిక్యం
17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యం
16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యం
13 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 54,448 ఓట్ల ఆధిక్యం
12 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 50,654 ఓట్ల ఆధిక్యం
11 రౌండ్లు పూర్తయేసరికి 46,604 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ
10 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 42, 254 ఓట్ల ఆధిక్యం
9 రౌండ్ పూర్తయ్యేసరికి 37,609 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీ
8 రౌండ్ పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డి 32,892 ఓట్ల ఆధిక్యం
ఏడో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 28వేలకు పైగా మెజారిటీ
ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ 31వేలకు పైగా మెజారిటీ
ఐదో రౌండ్ పూర్తయ్య సరికి వైఎస్సార్‌సీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ.
నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి 17వేలకు పైగా ఆధిక్యంలో మేకపాటి విక్రమ్‌రెడ్డి
మూడో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 12, 864 ఓట్ల మెజారిటీ
రెండో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ
తొలిరౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)