ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యంలో నిలిచారు. బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన వైసీపీ రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళుతోంది. ఇక పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం లభించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217, అందులో పోస్టల్ బ్యాలెట్లలో చెల్లిన ఓట్లు- 205. వైఎస్సార్‌సీపీకి పోలైన ఓట్లు-167 వచ్చాయి.
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.
రౌండ్లవారీగా ఫలితాలు
17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యం
16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యం
13 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 54,448 ఓట్ల ఆధిక్యం
12 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 50,654 ఓట్ల ఆధిక్యం
11 రౌండ్లు పూర్తయేసరికి 46,604 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ
10 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 42, 254 ఓట్ల ఆధిక్యం
9 రౌండ్ పూర్తయ్యేసరికి 37,609 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీ
8 రౌండ్ పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డి 32,892 ఓట్ల ఆధిక్యం
ఏడో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 28వేలకు పైగా మెజారిటీ
ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ 31వేలకు పైగా మెజారిటీ
ఐదో రౌండ్ పూర్తయ్య సరికి వైఎస్సార్‌సీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ.
నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి 17వేలకు పైగా ఆధిక్యంలో మేకపాటి విక్రమ్‌రెడ్డి
మూడో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 12, 864 ఓట్ల మెజారిటీ
రెండో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ
తొలిరౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ