Attack On CM Jagam: విజయవాడ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి..ముఖ్యమంత్రి ఎడమకంటి కనుబొమ్మపై గాయం
బస్సుపై నుంచి సీఎం వైయస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం వైయస్ జగన్ కనుబొమ్మకు రాయి తగిలింది.
విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం వైయస్ జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైయస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం వైయస్ జగన్ కనుబొమ్మకు రాయి తగిలింది. సీఎం వైయస్ జగన్ పై క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాయి తగలడంతో సీఎం వైయస్ జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వైయస్ జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. వెంటనే సీఎం వైయస్ జగన్‌కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర ముఖ్యమంత్రి కొనసాగించారు.
సీఎం వైయస్ జగన్ బస్ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ప్రతిపక్షాలు ఓర్వలేకే దాడికి పాల్పడినట్లు వైయస్ఆర్ సీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం వారధి మీదుగా విజయవాడకు వైయస్ జగన్ బస్ యాత్ర వచ్చింది. విజయవాడలో సీఎం వైయస్ జగన్ కోసం పోటెత్తిన జనం. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు.