JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కార్తీక్‌పై హత్యాయత్నం
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్ హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
Vijayawada, Jan 30: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ (ITDP) పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్ (Karthik) హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న ఆయనపై గత అర్ధరాత్రి కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. కత్తులు, కర్రలతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కార్తీక్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వైసీపీ వారే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు.
పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఏకంగా రూ. 35 పెంచిన పాకిస్థాన్