Telugu States Bypolls 2021: బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు, అధికార పార్టీకి పోటీగా రెండు జాతీయ పార్టీలు రంగంలోకి.., హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు

బద్వేలు బరిలో (Badvel bypoll on Oct 30) నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం పోటీలో (badvel ByElection) 15 మంది అభ్యర్థులు నిలిచారు.

Election Commission of India. File Image. (Photo Credits: PTI)

Amaravati, Oct 13: ఏపీలోని కడపజిల్లాలో బద్వేలు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో (Badvel bypoll on Oct 30) నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం పోటీలో (badvel ByElection) 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్‌ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు పోటీ నుంచి తప్పుకోవడంతో వార్ వన్ సైడ్ అవుతుందనుకున్న పరిస్థితి రివర్స్ అయింది. రెండు జాతీయ పార్టీలు ఉపఎన్నిక బరిలో దిగడంతో పోటీ ట్రయాంగిల్ వార్‌గా మారింది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లతో అధికార వైసీపీ వైపు కాలు దువ్వుతున్న పార్టీలు గెలుపు తమదేనంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏకగ్రీవమవుతుందనుకున్న ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. బద్వేల్‌ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధ, బీజేపీ నుంచి సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేస్తున్నారు.

శ్రీశైలం, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక కృష్ణా బోర్డు పరిధిలోకే, మాకు ఒకే అన్న ఏపీ, జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమని స్పష్టం చేసిన తెలంగాణ,ఈ నెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి రావడంపై సందిగ్ధత

ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ ఆగ్రనేతలు కలియ తిరుగుతుండగా బీజేపీ నేతలు పాగా వేశారు. ఇక తామేమీ తక్కువ కాదంటున్న కాంగ్రెస్ 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ప్రకటించింది. ఇక ఈ కమిటీలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రులు జేడి శీలం, చింతామోహన్, పల్లంరాజు, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఉమెన్ చాంధీ, బాపిరాజు, హర్షకుమార్, రఘువీరారెడ్డిలు ఉన్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో జరుగుతున్న ఉపఎన్నికలో భారీ మెజార్టీ సాధించే దిశగా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. మరో వైపు చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టి తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తహతహలాడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ ఎమ్మెల్యే ఉపఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో అధికార వైసీపీ పార్టీ వెంటక సుబ్బయ్య సతీమణికే టిక్కెట్‌ను కేటాయించడంతో టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇక మిత్ర పక్షం తప్పుకోగా బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమైంది. జనసేన పోటీ చేయకున్నా తమకు మద్దతు ఇస్తుందని చెబుతోంది.

హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ​ఉప​ ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది.