Visakha: ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు!

ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Vishaka(X)

Vishakhapatnam, Jul 21:  ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా విశాఖపట్నంలో వైసీపీకి మేయర్ పీఠం చేజారనుంది. కీలకమైన విశాఖ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ ,జనసేన నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఇవాళ వైసీపీకి చెందిన 14 మంది కార్పొరేటర్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్ద ఎత్తున కార్పొరేటర్లు పార్టీ మారడంతో మేయర్ పీఠం కూటమి వశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కార్పొరేటర్లను బుజ్జగించేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇక కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. 23న లేదా 24న జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో 98 వార్డులుండగా 2021 ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకుంది. ఇక టీడీపీ 30 వార్డులు గెలుచుకోగా జనసేన మూడు,సీపీఎం,సీపీఐ,బీజేపీ చేరో స్థానంలో గెలిచాయి. నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందగా వారు వైసీపీకి మద్దతిచ్చారు. ఇక ప్రస్తుతం అధికారం టీడీపీ కూటమి వశం కావడంతో ఆపరేషన్ విశాఖ కార్పొరేషన్ చేపట్టారు కూటమి నేతలు. ఇందులో భాగంగా తొలుత 14 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరగా మరికొంతమంది జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా రానున్న రోజుల్లో వైసీపీ రాజకీయంగా మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. చాపకిందనీరులా విస్తరిస్తున్న చండీపురా వైరస్, గుజరాత్‌లోనే 16 మంది మృతి, నిర్లక్ష్యం చేస్తే అంతే!



సంబంధిత వార్తలు

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్