BJP on AP Capital: రాజధానిని మార్చుకోండి, కేంద్రం రాజధాని మార్పు విషయంలో జోక్యం చేసుకోదని తెలిపిన ఏపీ బీజీపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
దేశంలో అనేక చోట్ల రాజధానులు (Capitals) ఏర్పాటు చేస్తున్నారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల (State Govt)నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు.
Amaravati, July 31: ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP AP President Somu Veerraju) స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు (Capitals) ఏర్పాటు చేస్తున్నారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల (State Govt)నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం, కన్నా లక్ష్మీనారాయణకు ఉద్వాసన, కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు మూడు రాజధానుల (Three Capitals) విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని ఆయన తేల్చిచెప్పారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక తాము సీరియస్‌గా ఉండబోతున్నామని తెలిపారు. రాజ్‌భవన్‌కు చేరిన మూడు రాజధానుల బిల్లు, ఆమోదించవద్దని గవర్నర్‌కు చంద్రబాబు లేఖ, నిబంధనల ప్రకారమే గవర్నర్ చెంతకు చేరాయన్న వ్యవసాయమంత్రి కన్నబాబు
బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు.
ఇదిలా ఉంటే టీడీపీ నుంచి బీజేపీకి మారిన ఎంపీ సుజనా చౌదరి (Sujana Chowdary) రాజధానిపై పార్టీకి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌కు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 254 ప్రకారం గవర్నర్ ఆ బిల్లును కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదించే ఆస్కారం లేదని సుజనా అన్నారు. రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని.. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5,6కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు.
Here's AP BJP Tweet
ఏపీ రాజధాని వ్యవహారంలో ఆయన వ్యాఖ్యలపై పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు’అంటూ ట్వీట్ చేశారు.