Andhra Pradesh BJP President Somu Veerraju. (Photo Credits: Twitter)

Amaravati, July 28: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు (Kanna Lakshmi Narayana) పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు (Somu Veerraju) నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP national president, Jagat Prakash Nadda) ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు, తూర్పు గోదావరిలో ఆగని కోవిడ్-19 కల్లోలం, ఏపీలో 1,090కు చేరిన మృతుల సంఖ్య, కర్ణాటకలో లక్ష దాటిన కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం సోము వీర్రాజు స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన (BJP Somu Veerraju) దశాబ్దాలుగా సంఘ్‌ పరివార్‌లో కొనసాగారు. ప్రస్తుతం ఆయన ఏపీ మండలిలో సభ్యునిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీల మధ్య పొత్తులో అయన కీలక పాత్ర పోషించారు. ఇక అటు తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ ని నియమించిన సంగతి తెలిసిందే.

కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకో ఏడాదితో ముగియనుంది. 2018లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నాతో వీర్రాజు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అధిష్ఠానం వీర్రాజుకు ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించి, రాష్ట్ర అధ్యక్ష పదవిలో కన్నాను నియమించింది. ఇప్పుడు కన్నాను తప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజును నియమించారు. మొదటి నుంచీ పార్టీకి విధేయంగా ఉన్నవారినే బీజేపీ కీలక స్థానాల్లో నియమించాలన్నది సంఘ్‌ పరివార్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పుడు వీర్రాజుకు అదే ప్లస్‌ పాయింట్‌ అయిందని అంటున్నారు.

అయితే బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎమ్మెల్సీ మాధవ్‌, రాయలసీమకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. అయితే సామాజిక కారణాలతోపాటు, పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా ఉన్న సోము వీర్రాజునే పదవి వరించినట్లు చెబుతున్నారు.