MP Vijayasai Reddy on Budget 2021: పోలవరం ఊసే లేదు, ఫిషింగ్ హార్బర్ చెప్పుకునేంతగా లేదు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారు, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు.

YSRCP MP Vijaya Sai Reddy (Photo | @VSReddy_MP/Twitter)

Amaravati, Feb 1: ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy on Budget 2021) అన్నారు. బడ్జెట్‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని మండిపడ్డారు. ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని, రాష్ట్రానికి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం (Vijayasai Reddy Comments On Union Budget 2021 ) వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు. ఏపీలో మెట్రో రైలు కోసం కేంద్రాన్ని ఆరేళ్లుగా కోరుతున్నామని తమ విజ్ఞప్తుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని అసంతప్తి చెందారు. కొత్త టెక్స్‌టైల్‌ పార్క్‌ కావాలని కోరామని దానికి సంబంధించి బడ్జెట్‌లో ఏమాత్రం కేటాయింపులు లేవన్నారు.

పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదని, ఫ్రైవేట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని తాము కోరగా దాన్ని కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో జనాభా లెక్కింపు, 75 ఏళ్లు పైబడిన వారికి ఐటీ రిటన్స్‌ దాఖలు నుంచి మినహాయింపు, ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు దేశ వ్యాప్తంగా అమలు, బడ్జెట్ 2021 కీ పాయింట్స్ ఇవే

అదే విధంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. ద్రవ్యోల్బణం పెరిగినా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని, కేంద్ర ప్రభుత్వం ఒకటే ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం పెద్దగా చెప్పుకోదగ్గ విషయం కాదన్నారు.

సామాన్యుల నడ్డి మళ్లీ విరగనుందా.., పన్ను చెల్లింపుదారులకు కనపడని మినహాయింపులు,పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, తగ్గనున్న బంగారం, వెండి ధరలు, భారీగా పెరిగిన ద్రవ్యలోటు

రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సహాయాన్ని పదివేలకు పెంచాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను కూడా ఆరోగ్యశ్రీ తరహాలో మార్చాలని అన్నారు. నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని, నిరుద్యోగ నిర్మూలన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులు పెంచాలని కోరినట్లు తెలిపారు.



సంబంధిత వార్తలు

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్