Andhra Pradesh: వైయస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకు నిరాకరించిన న్యాయస్థానం, రఘురామ పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ స్పెషల్ కోర్టు

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను (Ys Jagan Bail Revocation Petition) సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (CBI Special Court) నిరాకరించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది

CBI (Photo-PTI)

Amaravati, Sep 15: సీబీఐ కోర్టులో సీఎం జగన్‌కు రిలీఫ్‌ దొరికింది. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను (Ys Jagan Bail Revocation Petition) సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (CBI Special Court) నిరాకరించింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju) పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటిషన్‌ను కొట్టేసింది.

రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు.

జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించిన హైకోర్టు, రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత, నేడు బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సీబీఐ కోర్టు

బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు.