Cement prices Drop in AP: శుభవార్త..ఏపీలో తగ్గిన సిమెంట్ ధరలు, పీపీసీ బస్తా ధర రూ.225, ఓపీసీ సిమెంటు బస్తా ధర రూ.235, ప్రకటించిన సిమెంట్ కంపెనీల యాజమాన్యం

ఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. ప్రభుత్వ పనులు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు సిమెంటు ధరలను తగ్గిస్తున్నట్లు (Reduction In Cement Prices) సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సోమవారమిక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.

cement-companies-reduce-prices-on-behest-of-AP-cm-ys-jagan-mohan-reddy (photo-Twitter)

Amaravati, Mar 17: ఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. ప్రభుత్వ పనులు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు సిమెంటు ధరలను తగ్గిస్తున్నట్లు (Reduction In Cement Prices) సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సోమవారమిక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.

ఇకపై సిమెంటు(పీపీసీ) బస్తా ధర రూ.225, ఓపీసీ సిమెంటు బస్తా రూ.235కి ఇస్తామని.. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ ధరలు తక్కువని (Cement Prices) వారు చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌లో సిమెంటు బస్తా ధర రూ.380 వరకు ఉందని, కొన్ని పనులకు మాత్రం తగ్గించి ఇస్తామని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పనులు, పేదల ఇళ్లకు అవసరమయ్యే సిమెంటు లెక్కలను అధికారులు వారికి తెలియజేశారు.

గృహనిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, పంచాయతీరాజ్‌ శాఖకు 25 లక్షల మెట్రిక్‌ టన్నులు, జలవనరుల శాఖకు 16.5 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరమని పేర్కొన్నారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బస్తా ప్రత్యేక రంగులో ఉండాలని.. ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్‌ ద్వారా ఈ సిమెంటు పంపిణీ అవుతుందని సీఎం తెలిపారు.

Here's AP CMO Tweet

సమావేశంలో జువారి, భవ్య, సాగర్‌, కేసీపీ, రైన్‌, భారతి, అలా్ట్రటెక్‌, జేఎ్‌సడబ్ల్యూ, శ్రీచక్ర, ఇండియా, మైహోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్య బిర్లా, చెట్టినాడ్‌, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్‌ సిమెంటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి

RS Praveen Kumar Slams CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ కి మొబిలిటీ వ్యాలీ కి తేడా ఏంటో చెప్పండి... కేటీఆర్ ఐడియాను కాపీ కొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు

Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం

Share Now