Polavaram Reimbursement Funds: పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి, జగన్ సీఎం అయిన తరువాత కేంద్రం నుంచి వచ్చిన తొలి నిధులు ఇవే
పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్‌మెంట్ నిధుల్లో (Polavaram Reimbursement Funds) 1850 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
Amaravathi, November 8: ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం(Central Government) నుంచి మరో ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్‌మెంట్ నిధుల్లో (Polavaram Reimbursement Funds) 1850 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పోలవరం (Polavaram) నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 5వేల 600కోట్లు ఖర్చు చేయగా 1850కోట్లు రీఎంబర్స్‌మెంట్ చేసేందుకు కేంద్ర ఆర్ధికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో త్వరలోనే నాబార్డు నుంచి ఏపీకి ఈ నిధులు అందనున్నాయి. పోలవరం పనులు తిరిగి ప్రారంభం
పోలవరం కోసం ఖర్చు చేసిననిధులను తిరిగి చెల్లించాలని సీఎం జగన్ (AP CM Jagan) ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పడు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం నిధులు విడుదల చేసింది. జగన్ సర్కార్ కొత్త రికార్డ్ , రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా
అయితే మొదట 3వేల కోట్ల రూపాయలు వస్తాయని భావించారు. కానీ కేంద్రం రాష్ట్రాన్ని మరికొన్ని వివరాలను అడిగింది. అవి పరిశీలించిన తర్వాత మిగిలిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. జగన్ సీఎం అయిున తర్వాత పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.850 కోట్ల రూపాయలు ఆదా అయ్యింది.
జగన్ ఢిల్లీ పర్యటనలో ఇదే విషయాన్ని ప్రధాని (Prime MInister)కి, హోమంత్రి అమతి షా (Home minister Amit shah) కు వివరించారు. జగన్ సీఎం అయ్యాక కేంద్ర నుండి పోలవరం ప్రాజెక్టుకు విడుదలైన తొలి నిధులు ఇవేనని చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఆర్దిక ఇబ్బందుల్లో కేంద్రం నుండి పోలవరం రీయంబర్స్ మెంట్ నిధుల్లో భాగంగా ఇప్పుడు రూ 1850 కోట్లు రావటం రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ ఇవ్వనుంది. కాగా గత వారమే పోలవరం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.