Chalo Vijayawada: చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపు, విజయవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్ అమలు, నిరసనకు అనుమతి లేదని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా

నగరంలో 144 సెక్షన్ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Vijayawada CP-Kanthi-Rana (Photo-Video Grab)

Amaravati, April 25: ఈ నెల 25వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునివ్వడంతో ( AP Govt Employees Protest) విజయవాడలో పోలీసులు హై అలర్ట్ విధించారు. నగరంలో 144 సెక్షన్ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం (Chalo CMO Tension) వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. దావులూరు, పొట్టిపాడు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. రైలు, రోడ్డు మార్గాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు విజయవాడ, గుంటూరుకు చేరుకోకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద పూర్తి నిఘా ఉంచారు. సెల్ ఫోన్లు, ఐడీ కార్డులు చెక్ చేసి పంపుతున్నారు.

ఇప్పటికే దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. యూటీఎఫ్ చేపట్టిన (Chalo Vijayawada) అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

మే 1, 2 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజిలో YSRCP జాబ్ మేళా

నగరంలో 30 పోలీస్‌ యాక్ట్, 144 సీఆర్‌పీసీ ఆంక్షలు (Section 144 imposed in Vijayawada ) అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు.