Chandrababu Kuppam Tour: నా ఇంటికి నన్ను రానివ్వకుండా అడ్డుకుంటారా, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నా, రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని చంద్రబాబు మండిపాటు

తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు.

Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

Kuppam, Jan 4: చంద్రబాబు కుప్పం పర్యటనలో (Chandrababu Kuppam Tour) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం రోడ్డు మీద సమావేశాలు జరుపుకోవడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు. మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు.

నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, ‘నాకే రూల్స్‌ చెబుతారా’ (Will you tell me the rules) అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు.సమావేశాలకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సభలు నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు. ‘నేను అనుమతి తీసుకోవాలా’ అంటూ ఆగ్రహంతో చంద్రబాబు ( Naidu Fire on AP Police ) ఊగిపోయారు.

కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు, నాకే రూల్స్‌ చెబుతారా అంటూ మండిపాటు, సభకు అనుమతి లేదంటూ కుప్పం పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ అధినేత

తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా, ర్యాలీ నిర్వహించకుండా, సభ పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని... టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని... అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని అన్నారు. నిన్న జగన్ సభకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చెప్పారు.

ఉద్రిక్తంగా మారిన చంద్రబాబు కుప్పం పర్యటన, లాఠీఛార్జ్ చేసిన పోలీసులు, నిబంధల ప్రకారమే ఎవరికైనా సభకు అనుమతులు ఉంటాయని తెలిపిన కుప్పం పోలీసులు

ఇప్పుడు తన సొంత ఇల్లు కుప్పంకు తనను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో టీడీపీ సభలు పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. తన ప్రజలతో తాను కలవకూడదా అని మండిపడ్డారు. పోలీసులు కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాలని అన్నారు. జగన్ నియంతగా మారారని... ఆయన పాలన పోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఏ చట్టం ప్రకారం తనను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అడిగారు. తన రోడ్ షోకు, సభకు ఎందుకు అనుమతిని ఇవ్వడం లేదో రాసివ్వాలని పోలీసులను అడిగానని... ఇంత వరకు వారి నుంచి స్పందన లేదని చెప్పారు. డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే బాబాయ్ ని గొడ్డలితో ఎవరు నరికి చంపారో కనిపెట్టాలని అన్నారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 



సంబంధిత వార్తలు