Chandrababu Kuppam Tour (Photo-Video Grab)

కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు వాదులాటకు దిగారు. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరీవాణి శ్రీనివాసులు పోలీసులపై దౌర్జన్యం చేయడంతో వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఏపీ-కర్ణాటక బార్డర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు స్పందిస్తూ టీడీపీ నేతలు అనుమతి కోరితే తప్పకుండా పరిశీలించి అనుమతిస్తామన్నారు. కొత్త నిబంధల ప్రకారమే ఎవరికైనా అనుమతులు ఉంటాయని తెలిపారు. వాస్తవాలను కప్పి పుచ్చి టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాగా రహదారులపై సమావేశాలతో ప్రాణ నష్టం జరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

Here's Video

రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt Bans Rallies) నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని (Meetings on Public Roads) స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్‌ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చంటూ మినహాయింపునిచ్చింది.ఈమేరకు రాష్ట్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.