Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు, నాకే రూల్స్ చెబుతారా అంటూ మండిపాటు, సభకు అనుమతి లేదంటూ కుప్పం పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ అధినేత
ఏపీ ప్రభుత్వం రోడ్డు మీద సమావేశాలు జరుపుకోవడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు.
Kuppam, Jan 4: చంద్రబాబు కుప్పం పర్యటనలో (Chandrababu Kuppam Tour) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం రోడ్డు మీద సమావేశాలు జరుపుకోవడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు. మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, ‘నాకే రూల్స్ చెబుతారా’ (Will you tell me the rules) అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు.
సమావేశాలకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సభలు నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు. ‘నేను అనుమతి తీసుకోవాలా’ అంటూ ఆగ్రహంతో చంద్రబాబు ( Naidu Fire on AP Police ) ఊగిపోయారు.
అయితే బహిరంగ ప్రదేశంలో కాకుండా చిన్న గుడి ముందు సభకు టీడీపీ యత్నించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పోలీసుల నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు అనుమతి ఇవ్వరంటూ పోలీసులను నిలదీశారు.పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ కార్యకర్తల (TDP Protest) ఆందోళనకు దిగారు. ‘కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే బాబు ఉద్దేశం అని మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని నోటీసు ఇచ్చేందుకు పెద్దూరులో పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు జేపీ కొత్తూరు నుంచి ర్యాలీగా తరలిరావడం, పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడంతో ఏపీ - కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు.