Chandrababu on Election Result: ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత అప్‌డేట్ ఇస్తా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడి

మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ChandraBabu Naidu (Photo-Video Grab)

ఏపీ ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఏపీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో, 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ, 164 స్థానాలతో టీడీపీ కూటమి విజయభేరి

‘‘వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.

Here's Video

అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. టీడీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినపుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం టీడీపీకి, 39.37 శాతం వైసీపీకి వచ్చాయి’’ అని చంద్రబాబు తెలిపారు.

నేను అనుభవజ్ఞుడిని. నేను ఈ దేశంలో అనేక రాజకీయ మార్పులను చూశాను. మేము NDAలో ఉన్నాము, నేను NDA సమావేశానికి వెళ్తున్నాను, ఏవైనా అప్‌డేట్‌లు ఉంటే నేను మీకు తెలియజేస్తాను అని చంద్రబాబు అన్నారు.