Chandrababu Letter Row: ఫోన్ ట్యాపింగ్ అంతా డ్రామా, చంద్రబాబుపై మండిపడిన ఏపీ హోంమంత్రి సుచరిత, ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన హోం మంత్రి

ఈ లేఖపై ఏపీ హోం మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని (Chandrababu Naidu trying to create unrest in AP) రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో (DGP Gautam Sawang) కలసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సుచరిత (AP Home minister Mekathoti Sucharitha) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌లు ట్యాప్‌ చేస్తోందని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఫోన్‌లు ట్యాప్‌ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించారు.

Chandrababu Naidu trying to create unrest in AP Home minister Mekathoti Sucharitha (Photo-Twitter)

Amaravati, August 18: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ (phone tapping) జరుగుతోందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై ఏపీ హోం మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని (Chandrababu Naidu trying to create unrest in AP) రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో (DGP Gautam Sawang) కలసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సుచరిత (AP Home minister Mekathoti Sucharitha) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌లు ట్యాప్‌ చేస్తోందని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఫోన్‌లు ట్యాప్‌ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లంటూ టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి, చానళ్లలో డిబేట్‌లు నడిపిస్తూ ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతున్నట్టు ఆధారాలుంటే డీజీపీకి ఫిర్యాదు చేస్తే విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటారు. గతంలో చంద్రబాబు ఇజ్రాయెల్‌ ప్రత్యేక టెక్నాలజీతో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ను ట్యాప్‌ చేసిన విషయాన్ని మేం ఆధారాలతోసహా రుజువు చేశాం. ప్రస్తుతం టీడీపీ చేస్తున్న ఆరోపణలను అదే తరహాలో నిరూపించాలని డిమాండ్ చేశారు.

Here's AP Home Minister Tweet

కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులను పట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో పోలీసులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తారు. ఇతరుల ఫోన్లు ట్యాప్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు చేస్తున్నట్టే మేం కూడా నిరాధారంగా ఆయన హత్యలు చేశాడని, నారా లోకేశ్‌ అత్యాచారాలు చేశాడని ఆరోపిస్తే ఆయన ఊరుకుంటారా. తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

ఏపీలో జడ్జిల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారనేది శుద్ధ అబద్ధమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ప్రధాన మంత్రికి చంద్రబాబు రాసిన లేఖలో మోదీని కీర్తించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అనే సిద్ధాంతం పాటిస్తున్న చంద్రబాబు పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న విధంగా ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.