N Chandrababu Naidu | (Photo Credits: ANI)

Hyderabad, August 17: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ (Chandrababu Letter to PM Modi) రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతోందని. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని (YSRCP Govt Tapping Phones of Opposition Parties) లేఖలో ఆరోపించారు. ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని ఈ దుశ్చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని లేఖలో ప్రధాని మోదీకి (PM Narendra Modi) ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు లేఖలోని సారాంశం

‘‘మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత ఇనుమడించింది. భారత సాయుధ దళాల్లో నూతన విశ్వాసం పెరిగింది. అంతర్గత ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులతో వచ్చే ముప్పు తగ్గింది. విదేశీ సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి. ఏపీలోని రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్‌ల ట్యాపింగ్‌తో తీవ్ర ముప్పు ఉంది. దేశ భద్రతకే ఇది పెను ప్రమాదంగా పరిణమించే ప్రమాదం ఉంది. వైకాపా పాలనలో ఏపీ ప్రజలు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు. వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో ఎటువంటి చట్టబద్ధమైన విధానాన్ని వైసిపి ప్రభుత్వం పాటించడం లేదు. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19, ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. పౌరుల గోప్యతా హక్కును కాలరాయడమే ఇది.

Here's what Chandrababu Naidu mentioned in the letter to PM: 

భారతీయ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69లను కూడా వైసిపి ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. రాజకీయ లాభాల కోసమే చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తోంది. ఇల్లీగల్ సాఫ్ట్‌‌వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనేది మా ఆందోళన. జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అరాచకశక్తుల చేతిలో ఉంటే, వ్యక్తుల గోప్యతా హక్కు కాలరాయడమే.. అత్యున్నత స్థానాల్లోని వ్యక్తుల బ్లాక్ మెయిలింగ్‌కు, బెదిరించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ దారితీస్తుంది. ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నారు. ఈవిధమైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్‌లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పు’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. మరో అల్ప పీడనం..తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఇదిలా ఉంటే నా ఫోన్‌ కాల్స్‌ ట్యాప్‌ చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.రాజ్యాంగంలోని 14,19,21 అధికరణలను ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఉల్లంఘిస్తున్నాయి. అంతేగాక ఫోన్‌లో కొందరు వ్యక్తులు నన్ను తరచూ బెదిరిస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆదివారమిక్కడ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాకు ఫిర్యాదు అందజేశారు. వైఎస్‌ రెడ్డి అనే వ్యక్తి నన్ను హతమారుస్తానని బెదిరిస్తూ కాల్స్‌ చేశారు. నా ఫోన్‌ కాల్స్‌ ట్యాపింగ్‌ చేసినవారిపైనే కాకుండా బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిపైనా తక్షణమే చర్యలు తీసుకోండి’ అని అందులో కోరారు.