Chandrababu: ఏపీ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు.. ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు.. మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ
ముఖ్యమంత్రి జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.
Vijayawada, June 3: ఏపీలో (AP) వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ (YCP) పాలన, నేతలపై బీజేపీ నేతల విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.