Cheetah Spotted Tirumala: తిరుమల మెట్లమార్గంలో మరోసారి చిరుత కలకలం, నడకదారి భక్తులకు మరోసారి అలర్ట్ జారీ, అప్రమత్తమైన టీటీడీ, చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు

ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah Spotted), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది.

Cheetah. Representational Image. (Photo credits: Twitter/ANI)

Tirupati, OCT 27: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah Spotted), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది. ఈ క్రమంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ (TTD) విజ్ఞప్తి చేసింది. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని కోరింది. ఇటీవల కాలంలో తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లను ఏర్పాటు దాదాపు ఐదు వరకు చిరుతలను బంధించారు.

CCTV Footage: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యూటీలో ఉన్న పోలీసును ఢీకొట్టిన ఎస్‌యూవీ, బారికేడ్లతో సహా ఎగిరి అవతల పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ 

అయితే, శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో కొన్ని మాత్రమే ఆహారం కోసం వెతుక్కుంటూ మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయని ఫారెస్ట్‌ అధికారులు పేర్కొంటున్నారు. లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసిన అనంతరం అలిపిరిమార్గంలో దాదాపు 200 కెమెరాలను ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు చిరుతల కదలికలను అధికారులు గుర్తించి.. అప్రమత్తం చేస్తున్నారు.