Chiru-Jagan Meet: కొత్త అంశాలకు తెరలేపుతున్న చిరంజీవి-జగన్ భేటీ, అక్టోబర్ 14న సమావేశం, సైరా సినిమా ఆహ్వానానికే అన్న చిరంజీవి, రాజకీయాల చర్చలకు అవకాశం ఉందంటున్న విశ్లేషకులు

తనను కలవాలనుకుంటున్న చిరంజీవిని తన ఇంటికి విందుకు సీఎం జగన్ ఆహ్వానించారు.

chiranjeevi-meet-cm-jagan-october-14th (Photo-wiki)

Amaravathi, october 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైంది. తనను కలవాలనుకుంటున్న చిరంజీవిని తన ఇంటికి విందుకు సీఎం జగన్ ఆహ్వానించారు. 14న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఈ సమావేశం పైన రాజకీయంగానే కాకుండా.. సినిమా వర్గాల్లోనూ ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఉన్నట్లుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పాయిట్‌మెంట్ కోరడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలోనూ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

వీరిద్దరి కలయిక ఇలా ఉంటే... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన ప్రతీసారి ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ముందుకెళుతున్నారు. కాగా చిరంజీవి ఇప్పటికే జగన్ మీటింగ్ వెనక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని.. కేవలం సినిమా పరంగానే ఈ చర్చలు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. సైరా సినిమా చూడ్డానికి ముఖ్యమంత్రిని చిరు ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నాడని.. అందుకే అప్పాయిట్‌మెంట్ కూడా అడిగాడని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ తమిళిసైను ప్రత్యేకంగా ఆహ్వానించి షో వేసాడు. ఇప్పుడు జగన్ ని ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు. కాగా చాలా రోజుల తర్వాత చిరు..జగన్‌ను కలుస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో కలిసినా..అవి ప్రైవేటు కార్యక్రమాలు కావడం పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ కావడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే చిరు - జగన్ భేటీపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ భేటీలో పొలిటికల్ టర్న్‌లు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.

ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారితే మంత్రి బొత్స సత్యానారాయణ ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి జగన్‌ను కలవడంలో విచిత్రం ఏముందని.. ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది వచ్చి కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. గతంలో నాగార్జున, మోహన్‌బాబుతో పాటూ చాలామంది వచ్చి జగన్‌ను కలిశారని గుర్తు చేశారు.కాగా ఈ మీడియా సమావేశంలో బాలయ్యని పరోక్షంగా ప్రస్తావిస్తూ సెటైర్ వేసారు. సినిమా ఇండస్ట్రీ అంటే బాలయ్య ఒక్కరేనా.. అసోసియేషన్ మొత్తం వచ్చి కలవాలా.. అవసరమైతే వచ్చి వాళ్లు కలుస్తారని తెలిపారు.