CM Jagan Slams Pawan Kalyan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా నీకు రాలేదు పవన్, పలాస సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, విశాఖకు నేను వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారంటూ మండిపాటు

ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు (Even votes that came to Sister Barrelakka) కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు.

Chandrababu and Jagan and Pawan Kalyan (Photo-FB)

Palasa, Dec 14: పలాస బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆయన శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్‌.. గురువారం ప్రారంభించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజె­క్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో (CM Jagan Speech Highlights in Palasa Tour) సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు (Even votes that came to Sister Barrelakka) కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులని ప్రారంభించిన సీఎం జగన్‌, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు

‘‘విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్‌ లోకల్స్‌ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాల్లో నిర్ణయిస్తామంటారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు.

Here's CM Jagana Palasa Tour Visuals

ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు.

ఫ్యాన్‌ తుపాన్‌లో ప్రతిపక్షాలు గల్లంతు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపిన టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వే

‘‘ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకువచ్చాం. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అ‍త్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం పేర్కొన్నాం.

కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్‌ క్లినిక్‌, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నామని సీఎం అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif