ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది. టీడీపీ గరిష్టంగా ఒక స్థానంలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. జనసేన ఖాతా తెరిచే అవకాశమే లేదంది. టైమ్స్‌నౌ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్‌నౌ ఛానల్‌ ప్రసారం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ.. ప్రస్తుతం మరింత బలపడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24–25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది తేల్చింది. గత ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమా­భి­వృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగింది. ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఈ నెల 18 నుంచి ప్రారంభం

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)