Kakinada Memantha Siddham Sabha: జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్
ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు.
Kakinada, April 19: మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయని.. జైత్రయాత్రకు సిద్ధమని ప్రజలంతా సింహగర్జన చేస్తున్నారని తెలిపారు. మంచి చేసిన మీ బిడ్డకు తోడుగా ఉండేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
సీఎం జగన్ మాట్లాడుతూ..వైఎస్సార్‌సీపీకీ ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం జగన్ మండిపడ్డారు. భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి, చూడయ్యా దత్తపుత్రా అంటూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన సీఎం జగన్,భీమవరం మేమంతా సిద్ధం సభ హైలెట్స్ ఇవే..
పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి క్లాస్ వార్ జరుగుతోందన్నారు సీఎం జగన్. మీరేసే ఓటు.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తని అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బాబు మార్క్ పాలన అని మండిపడ్డారు. రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే జగన్ మార్క్ పాలన కొనసాగుతోందన్నారు.
ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి.చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు. జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం. బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే.రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది.బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుందని మండిపడ్డారు.