Memantha Siddham in Bhimavaram: భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి, చూడయ్యా దత్తపుత్రా అంటూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన సీఎం జగన్,భీమవరం మేమంతా సిద్ధం సభ హైలెట్స్ ఇవే..
Cm Jagan (Photo-Video Grab)

Bhimavaram, April 16: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజైన మంగళవారం నారాయణపురం నుంచి ప్రారంభమై భీమవరం సభతో ముగిసింది. భీమవరం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది.ఉప్పొంగిన ప్రజాభిమానం కనిపిస్తోంది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్థమా? అని అన్నారు.

మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్‌.. దుష్టచతుష్టయం కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి.పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. మీ బిడ్డది పేదలపక్షం.చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది. ఆయన మాటల్లో, మాట్లాడేటప్పుడు హైబీపీ వస్తా ఉంటుంది.. మీరు గమనించే ఉంటారు. శాపనార్థాలు పెడుతూ ఉంటాడు.. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటాడు.రాళ్లు వేయండని పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి అని మండిపడ్డారు.  ఒక్క సీటు కూడా తగ్గకూడదు, 200కి 200 కొట్టాల్సిందే, గాయం తర్వాత గుడివాడ మేమంతా సిద్ధం సభలో గర్జించిన సీఎం జగన్

నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకంటే.. ఎందుకో తెలుసా.. అడగకూడని ప్రశ్న చంద్రబాబుని అడిగినందుకు.. అదేమిటో తెలుసా.. బాబు.. బాబు.. చెరువులో కొంగ మాదిరిగా ఎదురుచూస్తూ ఇంకొపక్క కొంగమాదిరిగా జపం చేస్తావ్‌ ఎందుకయ్యా అని అడగా ఇలా అడగడం తప్పా చెప్పండి.చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్‌ ఒక్కటైనా ఉందా అని అడిగా. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబుని అడిగా.. అందుకే నాపై కోపం, ఆయనకు అందుకే బీపీ ఎక్కువై పోతోంది.

ఆయన చేసిన మంచి ఏ ఒక్కటీ గుర్తుకురాకపోగా, ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేవి ఏమిటో తెలుసా.. వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలు

ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా దత్తపుత్తా, దత్తపుత్రా.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, పిల్లల్ని పుట్టిచ్చి, నాలుగేళ్లకు, ఐదేళ్లకొకసారి కార్లును మార్చేసినట్లుగా భార్యను వదిలేసినట్లుగా నియోజకవర్గాలకు అలవోకగా మార్చేస్తున్నావ్‌.. ఏం మనిషవయ్యా అని అడిగా

అందుకే దత్తపుత్రుడిలో బీపీ బాగా కనిపిస్తోంది. .  సీఎం జగన్‌పై రాయి దాడి, నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 2 లక్షలు నగదు బహుమతి ప్రకటించిన ఏపీ పోలీసులు

అయ్యా దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా. పవిత్రమైన సంప్రదాయాన్ని నడినొడ్డమీదకు తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా. ఇది నేను అడిగితే తప్పుకాదా. ఇలా నిన్ను చూసి ఇదే తప్పు ప్రతీ ఒక్కరు చేస్తే.. ఇలా భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఆ పెద్ద మనిషిలో బీపీ కూడా పెరిగిపోతోంది. చేయిలూపేస్తాడు.. కాళ్లు ఊపేస్తాడు.. తల ఊపేస్తాడు. పవన్‌ కల్యాణ్‌ బీపీని అసలు తట్టుకోలేము.చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, ఈ బాజాభజీంత్రీలకు ఎందుకు నాపై కోపం వస్తుందంటే..కారణం ఈ వర్గాలన్నింటినీ.. ఈ పేదలను, ఈ అక్కా చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వాతాతలను, రైతన్నలను నువ్వు ఎలా ముంచావంటే చెప్పడానికి బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి

చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణలు కనిపించవు.ప్రజలిచ్చిన అధికారాన్ని ఏనాడు కూడా చంద్రబాబు మంచి కోసం ఉపయోగించలేదు.మోసాల్ని, అబద్ధాల్ని, వెన్నుపోట్లని, కుట్రల్ని, పొత్తుల్ని నమ్ముకుని ఈ రోజు చంద్రబాబు రాజకీయం చేయాల్సి వస్తుంది.ఎందుకంటే చేసిన మంచి లేదు కాబట్టే.. వీటిని నమ్ముకుని ఇలా రాజకీయాలు చేస్తా ఉన్నాడు.మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే.. పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా జనం మద్దతులేని ఈ చంద్రబాబు.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ​‍్యోతి, ఒక టీవీ-5, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్‌. వీరందరీతో పాటు కుట్రలు, మోసాలు, ఇతర పార్టీల్లో చంద్రబాబు పెట్టుకున్న కోవర్టులు కలిసి ఒక్క జగన్‌ మీద దండయాత్రలు చేస్తా ఉన్నారని సీఎం జగన్ అన్నారు.

జగన్‌ ఒక్కడు.. బాబుకు పదిమంది సేనానులు.వారంతా కూడా బాణాలు పట్టుకుని ఉన్నారు. మరి వారు బాణాలు తగిలేది ఎవరికి అని అడుగుతున్నా.. జగన్‌ పేదలకిచ్చే పథకాలకా అని ప్రతీ ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా. వారు బాణాలు తగిలేది.. జగన్‌కు.. జగన్‌ పెట్టిన వాలంటీర్లు, సచివాలయవ్యవస్థలకా?

వారు బాణాలు తగిలేది.. జగన్‌ తెచ్చిన ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ల వ్యవస్థలకా? వారు బాణాలు తగిలేది.. జగన్‌కా.. జగన్‌ మార్పులు తెస్తూ పిల్లల భవిష్యత్‌లకా, వారి చదువులకా? వారు బాణాలు తగిలేది.. అవ్వా తాతాల పెన్షన్‌కు తగులుతా ఉందా.. లేక జగన్‌కు తగులుతా ఉందా? వారు బాణాలు తగిలేది.. జగన్‌కు తగులుతా ఉందా.. రైతన్నకు ఇస్తున్న రైతు భరోసాకా? వారు బాణాలు తగిలేది.. జగన్‌కు తగులుతున్నాయా.. లేక అక్కచెల్లెమ్మలకోసం, వారి అభ్యుతన్న కోసం, వారి కుటుంబాలకు తగులుతుందా? అని ప్రశ్నించారు.

నా అక్క చెల్లెమ్మల కోసం, వారి సంక్షేమ కోసం వారి ఖాతాల్లోకి రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ వేశాడు.వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతున్నాయో ఆలోచన చేయమని అడుగుతున్నాను. నేను తీసుకొచ్చిన పథకాలమీద.. వీరంతా బాణాలు ఎక్కుపెడుతున్నారు ఆలోచన చేయమని అడుగుతున్నాను

ఈ యుద్ధం.. పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్‌ మీద, అవ్వా తాతల సంక్షేమ మీద, రైతన్నలకు అందుతున్న రైతు భరోసా మీది చంద్రబాబు అండ్‌ ఆయన పెత్తందార్ల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని ప్రతీ ఒక్కరు గమనించాలని కోరుతున్నాను

ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా కూడా సిద్ధమేనా?

కాబట్టే చెబుతున్నా.. జగన్‌ ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ప్రతీ ఇంట్లో సైన్యం ఉంది. జగనే ఉండాలి.. జగనే కావాలి.. జగనే రావాలి అని ఈరోజు ప్రతీ ఇంట్లో కూడా మద్దతు తెలిపే వారున్నారు. జగన్‌కు కోట్లాది మంది సైన్యం ఉంది.నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం

మీ బిడ్డకు రైతన్న, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉ‍న్నారు.ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్‌ ఎప్పుడూ ఒంటరి కాదు.చంద్రబాబుపై ఎల్లో మీడియా ఇచ్చేది అతిపెద్ద బోగస్‌ రిపోర్ట్‌. చంద్రబాబు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నాడు. ప్రతి జిల్లాలో హైటెక్‌ సిటీ అన్నాడు.. ఎక్కడైనా కనిపించిందా? కొత్తగా పోర్టులు కట్టాడా?

మెడికల్‌ కాలేజీలు కట్టాడా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చేశాడా? ప్రభుత్వ బడులు, ఆస్పత్రులనైనా బాగు చేశాడా? అని ప్రశ్నించారు సీఎం జగన్